ముంబయి సహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నటిని వ్యాపారవేత్త లైంగికంగా వేధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ముంబయి ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు అతనికి ఒక్కరోజు రిమాండ్ విధించింది.
విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్ - mumbai actress molestation news
విమానంలో ఓ నటిని లైంగికంగా వేధించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడికి కోర్టు ఒక్కరోజు రిమాండ్ విధించింది.
నటి దిల్లీ నుంచి ముంబయికి ఇండిగో విమానంలో చేరుకున్న తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విమానం ల్యాండ్ అయిన తర్వాత లగేజ్ తీసుకునేందుకు సీటు నుంచి లేచిన ఆమెను నిందితుడు వెనుక నుంచి లాగి బలవంతంగా వాటేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆమె సీరియస్ అయి అభ్యంతరం తెలపగా.. అతడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ముందు మరో ప్యాసెంజర్ ఉన్నాడని అందుకే లాగినట్లు చెప్పాడు. నటి వెంటనే విమానంలోకి సబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ఆ వ్యాపారవేత్తను అరెస్టు చేశారు. అతడిని గజియాబాద్‌కు చెందిన నితిన్ బన్సాల్‌గా గుర్తించారు.
ఇదీ చదవండి:లఖింపుర్ హింసపై విచారణ.. యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!