ఓ వివాహిత కుటుంబంపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. దీంతో ఆ మహిళ సహా ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ వెంటపడుతూ.. తన కుటుంబాన్ని వదిలేసి తనతో జీవితం పంచుకోవాలని కోరాడు ఆ ప్రేమోన్మాది. ఇందుకు ఆ మహిళ నిరాకరించడం వల్ల సహనం కోల్పోయి ఆమెపై కోపం పెంచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆదివారం అర్ధరాత్రి బాధిత గృహిణి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబంపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ఇద్దరూ గాయపడ్డారు. బిహార్ ముజఫర్‌పుర్ జిల్లా తూర్పు చంపారన్ ప్రాంతంలోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. దాడి సమయంలో యాసిడ్ ధాటికి అందరూ కేకలు వేయడంతో తెల్లవారుజామున స్థానికులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులందరిని దగ్గర్లోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నారు.
పిల్లల్ని వదిలి వచ్చేయమని ప్రేమెన్మాది టార్చర్.. ఇంటిపైకి ఎక్కి మరీ యాసిడ్ దాడి - Acid Attack On Women Family In Muzaffarpur Bihar
బిహార్‌లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న ఓ వివాహితను వేధించడం ప్రారంభించాడు. తన కుటుంబాన్ని వదిలేసి తనతో జీవితం పంచుకోవాలని కోరాడు. ఇందుకు ఆ గృహిణి ససేమిరా అనడం వల్ల ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఉన్నటుండి అర్ధరాత్రి సమయంలో బాధిత మహిళ సహా ఆమె కుటుంబం మొత్తంపై యాసిడ్ దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇంటిల్లిపాదికి గాయాలు కాగా.. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం..
మోతీహరి ప్రాంతంలో బాధిత మహిళ తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. నిందితుడు మహేశ్ భగత్ రాష్ట్ర వాటర్ బోర్డ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త అదే సంస్థలో దినసరి కూలీగా పనులు చేసేవాడు. ఈ సమయంలో ఆ మహిళకు మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. దీనిని చనువుగా తీసుకున్న నిందితుడు మహేశ్ మహిళను వేధించడం ప్రారంభించాడు. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి తనతో రావాలని.. తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు. ఇందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవడం వల్ల ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నాడు. పలుమార్లు ఆమె కుటుంబంపై బెదిరింపులకు సైతం దిగాడు నిందితుడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆమె ఇంటిపైకి ఎక్కి రేకులను తొలగించి.. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అందరిపై యాసిడ్ పోశాడు. అంతేకాకుండా వారికి సాయం అందకుండా ఇంటి బయట నుంచి తలుపులు మూసి పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ సహా భర్త, కుమారుడు, కుమార్తె గాయపడ్డారు.
పెళ్లైనట్లుగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి..
నిందితుడు మహేశ్ భగత్ తనకు బాధిత మహిళకు అప్పటికే పెళ్లైనట్లుగా నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా సృష్టించాడు. ఇందుకోసం మోతీహరి కోర్టులో పనిచేసే కొందరి సిబ్బంది సాయం తీసుకున్నాడు. ఈ డాక్యుమెంట్ల అండతో పెళ్లి చేసుకోవాలంటూ ఆ మహిళపై మరింత ఒత్తిడి తెచ్చాడు. తనకు పెళ్లై పిల్లలు ఉన్నారని బాధితురాలు ఎంత చెప్పినా వినకపోగా.. నిరాకరించినందుకు మహిళా కుటుంబంపై ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.