ఉత్తర్‌ప్రదేశ్ హాపుర్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడో దుండగుడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ నీరజ్ జదౌన్.
" రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలికపై పోసిన రసాయనం యాసిడ్‌గా అనుమానిస్తున్నా. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించాం. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మీరట్‌కు మర్చాం. కేసు నమోదు చేశాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. "
- నీరజ్ జదౌన్, హాపుర్ జిల్లా ఎస్పీ
ఇదీ చూడండి:మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్