దేశంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆకాంక్షించారు. దేశంలోని విభజన శక్తులను ఎదుర్కొనేలా కాంగ్రెస్ బలపడాలన్నారు. అంతకుముందు పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ అసంతృప్త నేతలు(జీ-23) 'శాంతి సమ్మేళన్' కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ బలపడాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులంతా కలిసి దేశంలోని విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. కాంగ్రెస్ 150ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ."