కర్ణాటకలోని కొడాగు జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుషాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
చిత్రదుర్గా ప్రాంతానికి చెందిన చెన్నమ్మ(28) తన కుటుంబంతో హెబ్బళే ప్రాంతానికి వలస వెళ్లింది. అక్కడ అల్లం పంట సాగుచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే.. కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు పిల్లల(వినయ్, విజయ్, దీక్ష)తో ఆమె ఆత్మహత్య చేసుకుంది.