తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2021, 11:15 AM IST

ETV Bharat / bharat

జల విలయం: ఒక్క ఫోన్​కాల్​తో కొండంత భరోసా

ఉత్తరాఖండ్​ జల విలయంలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన ఓ కార్మికుడి కుటుంబంలో ఓ ఫోన్​కాల్​ ఆనందం నింపింది. ప్రాణాలతోనే ఉన్నాడన్న భరోసా ఇచ్చింది. ఆ కథ ఏంటి? తెలుసుకుందాం రండి.

Utterakhand glacier burst
జితేంద్ర ధనయ్​

ఉత్తరాఖండ్​ జోషిమఠ్​ జిల్లా చమోలీ జల విలయంలో ఆచూకీ గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు కుటుంబసభ్యులు. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా.. ఎలా ఉన్నారో తెలియదు. ఈ పరిస్థితుల్లో.. ఓ కార్మికుడి కుటుంబంలో ఆనందం నింపింది ఓ ఫోన్​కాల్​. తమ మనిషి ప్రాణాలతోనే ఉన్నాడన్న భరోసా కల్పించింది.

తెహ్రీ గర్వాల్​కు చెందిన జితేంద్ర ధనయ్​ అనే కార్మికుడు తపోవన్​ విద్యుత్తు కేంద్రంలో 2017 నుంచి పని చేస్తున్నాడు. జల ప్రళయం జరిగి సొరంగంలో చిక్కుకుపోయాడు. అప్పటి నుంచి అతని కోసం కుటుంబ సభ్యులు ఫోన్​ చేస్తూనే ఉన్నారు. ఫోన్​ రింగ్​ అవుతున్నా సమాధానం లేకపోయేసరికి ఆందోళన చెందారు.

అయితే.. ఐదు రోజుల తర్వాత తమ ఫోన్​కు జితేంద్ర సమాధానమిచ్చారని ఆయన సోదరి సీమా తెలిపారు. హలో! అని అన్న వెంటనే కనెక్షన్​ తెగిపోయినట్లు చెప్పారు. తన సోదరుడి నుంచి స్పందన రావటం చాలా సంతోషంగా ఉందని.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న భరోసా వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'మంచు కురవడం వల్లే జలప్రళయం'

ఉత్తరాఖండ్ ఘటనలో 38కి చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details