మధ్యప్రదేశ్ రేవాలో దారుణం జరిగింది. మగబిడ్డ పుడితే నరబలి ఇస్తానని మొక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతడి కోరిక తీరడం వల్ల దివ్యాంశ్(18) అనే యువకుడిని నరబలి ఇచ్చాడు. అనంతరం నిందితుడు రామ్‌లాల్ ప్రజాపతి పరారయ్యాడు. ఈ హత్య వారం రోజులు క్రితమే జరగగా.. తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
అసలేం జరిగిందంటే:బైకుంత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెధువా గ్రామంలో పుల్మతి దేవి ఆలయం ఉంది. ఆ దేవాలయంలో మొండెం లేని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పక్కనే గొడ్డలి కూడా ఉంది. మృతుడు.. క్యోంటి గ్రామానికి చెందిన దివ్యాంశ్గా (18) గుర్తించారు. హత్యకు ముందు దివ్యాంశ్ అదే గ్రామానికి చెందిన రామ్‌లాల్ అనే వ్యక్తితో కనిపించినట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో రామ్‌లాల్‌ను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.