తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నర్సుగా రోగులకు సేవలు.. జిమ్​లో వర్కౌట్స్​తో కండలు.. టార్గెట్ ఒలింపిక్స్!

Bodybuilding competition: నర్సుగా ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూనే బాడీ బిల్డింగ్​లో రాణిస్తోంది బంగాల్​లోని మాల్డాకు చెందిన ఓ యువతి. ఇందుకోసం రోజు 150 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేస్తోంది. ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు చెబుతోంది. ఇంతకీ ఎవరా నర్సు?

Bodybuilding competition
నర్సు లిపిక

By

Published : May 8, 2022, 2:31 PM IST

Updated : May 8, 2022, 3:58 PM IST

ఒలింపిక్సే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న లిపిక

Bodybuilding competition: ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్నవారు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. ప్రస్తుత కరోనా సమయంలో వారు నిర్విరామంగా డ్యూటీ చేయాల్సి వస్తోంది. అయితే.. 25 ఏళ్ల ఓ యువతి అటు నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే తనకు ఇష్టమైన బాడీబిల్డింగ్​ చేస్తోంది. రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. జిమ్​కు వెళ్లి ఏదో అలా గడిపేస్తుందేమో అనుకుంటే పొరబడినట్లే.. గత ఏప్రిల్​లో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆరో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఆమెనే.. బంగాల్​, మాల్డా నగరానికి చెందిన లిపిక.

జిమ్​లో సాధన చేస్తున్న నర్సు లిపిక
జిమ్​లో సాధన చేస్తున్న లిపిక
నర్సుగా ఆసుపత్రిలో డ్యూటీ

ధలాయ్​ జిల్లాలోని సలేమా గ్రామానికి చెందిన లిపిక నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. 2020లో మాల్డాలోని చంచల్​ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో విధుల్లో చేరింది. ఉద్యోగం చేస్తూనే తన లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ప్రతిరోజు 150 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేస్తోంది. రోజూ ఉదయం చంచల్​లో బస్సు ఎక్కి మాల్డాకు వచ్చి.. కోచ్​ పింకు భగత్ ఆధ్వర్యంలో కొన్ని గంటల పాటు శిక్షణ తీసుకుంటుంది. ఆ తర్వాత తిరిగి చంచల్​కు వెళ్లి ఆసుపత్రిలో సేవలందిస్తుంటుంది. గత నెలలో పుణెలో జరిగిన ​అంతర్జాతీయ స్థాయి మిస్టర్​ అండ్​ మిస్​ యూనివర్స్​ పోటీల్లో ఆరో స్థానంలో నిలిచింది లిపిక. తన తదుపరి లక్ష్యం ఒలిపింక్స్​లో పాల్గొనటమేనని చెబుతోంది.

బాడీ బిల్డింగ్​ సాధనలో లిపిక
మెడల్స్​తో లిపిక

"నేను చేయాలనుకున్న పనిపై ఏకగ్రత పెట్టేందుకు ప్రయత్నిస్తా. నా విధులు ముగించుకున్నాక దానిపైనే దృష్టి పెడతా. నా డ్యూటీ ముగియగానే గుర్తొచ్చేది జిమ్​కి వెళ్లాలని. చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయటం అంటే ఇష్టం. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. మా నాన్న రిటైర్డ్​ టీచర్​. చిన్నప్పటి నుంచే నన్ను జిమ్​కి తీసుకెళ్లేవారు. తొలుత కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చినప్పటికీ సాధన చేయటం కొనసాగించాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికాక మాల్డాకు మారను."

- లిపిక, నర్సు

2021లో కోచ్​ పింకు భగత్​ను కలిశానని.. అప్పటి నుంచే బాడీబిల్డింగ్​ సాధన చేయటం మొదలు పెట్టానని తెలిపింది లిపిక. ఏప్రిల్​ 15-16 మధ్య పుణెలో జరిగిన పోటీల్లో ఆరో ర్యాంక్​ సాధిస్తానని ఊహించలేదని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. గతంలో బంగాల్​ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:'లిక్కర్​ కిక్ ఇవ్వట్లే.. కల్తీ చేస్తున్నారు!'.. హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు

రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...

Last Updated : May 8, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details