ఊరినిండా అప్పులు చేసిన 28 ఏళ్ల వ్యక్తి.. అవి తీర్చేందుకు తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. తల్లిదండ్రుల వద్ద నుంచే రూ.25 లక్షలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాడు. సహోద్యోగి భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న అతను.. ఆ మహిళతో కలసి ఈ కిడ్నాప్ కుట్రకు తెరలేపాడు.
పార్టీ నుంచి మాయం..
హరియాణా పానిపట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గత నెల 25న దిల్లీ రోహిణీ ప్రాంతంలో ఒక పార్టీకి హాజరైన రోజు నుంచి కనిపించట్లేదని కిడ్నాప్‌కు గురైన వ్యక్తి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఐపీసీ 356 సెక్షన్ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆ వ్యక్తి చివరిసారిగా సెక్టార్ 22 వద్ద ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు.