తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ అగ్ని ప్రమాదం- 500 దుకాణాలు దగ్ధం - మహారాష్ట్ర

మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాషన్​ మార్కెట్​ వీధిలో జరిగిన ప్రమాదంలో 500 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. థానేలోని బదలాపుర్​ పారిశ్రామిక వాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది.

fire-broke-out-at-fashion-street-market-in-pune
పుణెలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Mar 27, 2021, 9:49 AM IST

మహారాష్ట్ర, పుణెలోని ఫ్యాషన్​ మార్కెట్​ వీధిలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 500 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

పుణెలో భారీ అగ్నిప్రమాదం- 500 దుకాణాలు దగ్ధం
దగ్ధమైన దుకాణాలు
అగ్నిప్రమాదంలో కాలిబూడిదైన దుకాణాలు
బూడిదైన షాపులు
పుణెలో ఫ్యాషన్​ మార్కెట్​ వీధిలో అగ్నిప్రమాదం

16 అగ్నిమాపక వాహనాల సాయంతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. భారీ ఎత్తున ఎగిసిపడిన జ్వాలలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చినట్లు చెప్పారు.

బదలాపుర్​ పారిశ్రామిక వాడలో..

థానే జిల్లాలోని బదలాపుర్ ఎమ్​ఐడీసీ​ పారిశ్రామికవాడలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి.

ఇదీ చదవండి:బస్టాండ్​లో అగ్నిప్రమాదం- ఏడు బస్సులు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details