9 Family Members Weight Loss Surgery : ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు.. బరువు తగ్గేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వీరంతా ఏడేళ్ల కాల వ్యవధిలోబేరియాట్రిక్ సర్జరీచేయించుకుని బరువు తగ్గారు. మహారాష్ట్రకు చెందిన కుటుంబం.. ఇలా శస్త్ర చికిత్స చేయించుకుని బరువు తగ్గింది. వీరిలో కొంత మంది ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.
ముంబయికి చెందిన ఈ కుటుంబం అధిక బరువుతో బాధపడుతుండేది. దీంతో ఆ కుటుంబంలోని ఓ సభ్యుడు బరువు తగ్గేందుకు మొదట సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల మిగతా కుటుంబ సభ్యులు కూడా శస్త్ర చికిత్సకు ముందుకు వచ్చారు. ఇలా ఒకరి తరువాత ఒకరు.. మొత్తం తొమ్మిది మంది సర్జరీ చేయించుకున్నారు. జన్యు సంబంధమైన కారణాలతోనే ఈ కుటుంబ అధిక బరువుతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు.
తాజాగా అదే కుటుంబానికి చెందిన 19 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని కూడా బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకుంది. మొదట ఆమె 120 కిలోల బరువు ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆమె బరువు 101 కిలోలకు తగ్గిందని వారు వెల్లడించారు. ఇంకా కొద్ది రోజుల పాటు ఆమె ఈ చికిత్స చేసుకోవాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు వివరించారు.
ఈ ఇంటి యజమానికి సమీప బంధువైన ఓ వ్యక్తి.. అందిరికంటే ముందుగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. చికిత్సకు ముందు అతడి బరువు 200 కిలోలు ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆ వ్యక్తి.. 30 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. 2020 ప్రారంభంలో అతడు చికిత్స చేసుకున్నట్లు వారు వివరించారు. అయితే ఇతడు బరువు తగ్గడాన్ని గమనించిన కుటుంబ యజమాని భార్య.. తాను కూడా సర్జరీ చేయించుకుంది. 43 ఏళ్ల వయస్సున్న ఆమె.. డాక్టర్ సంజయ్ బోరుడేను కలిసి తన అనుమానాలు నివృత్తి చేసుకుంది. అనంతరం శస్త్ర చికిత్సకు చేసుకుని బరువు తగ్గింది. వీరి కుటుంబంలో సర్జరీ చేసుకున్న అతిపెద్ద వ్యక్తి వయసు 60 కాగా.. చిన్న వ్యక్తి వయసు 13 అని వైద్యులు తెలిపారు.
235 కేజీల భారీకాయుడికి ఆపరేషన్..
Obesity surgery: కొంతకాలం క్రితం ఊబకాయంతో అవస్థలు పడుతున్న 235కిలోల వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు. అధిక బరువుతో నడవలేని అతడ్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల సాయంతో మెటబాలిక్, బేరియాట్రిక్ ఆపరేషన్లు చేసి నయం చేశారు. అధిక బరువు వల్ల కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ అతడు.. శస్త్రచికిత్స పూర్తయిన కొద్దిగంటల్లోనే తనంతట తాను నడవగలిగాడని వైద్యులు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.