తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తౌక్టే విలయం: ఆ నౌకలో 34 మంది మృతి - Naval Staff

తౌక్టే తుపాను ధాటికి గల్లంతైన నౌకల్లోని 618 మందిని రక్షించింది నేవీ. ముంబయిలో పీ-305 నౌక కొట్టుకుపోయిన ఘటనలో ఇప్పటివరకు 184 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. నౌకలో చిక్కుకుని 34 మంది మరణించినట్లు పేర్కొన్నారు.

89 from P305 missing
184 మందిని రక్షించిన నేవీ అధికారులు

By

Published : May 19, 2021, 11:02 AM IST

Updated : May 19, 2021, 1:36 PM IST

తౌక్టే తుపాను కారణంగా ముంబయిలో రెండు నౌకలు కొట్టుకుపోయిన ఘటనలో పీ-305 నౌకలో ఉన్న మొత్తం 273 మందిలో ఇప్పటివరకు 184 మందిని రక్షించినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. పీ- 305 నౌకలో చిక్కుకుని 34 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 16 మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు.

యుద్ధనౌకలు రంగంలోకి..

ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్​ఎస్ కోల్​కతా ద్వారా పీ 305 నుంచి 184 మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐఎన్​ఎస్ తేజ్, ఐఎన్​ఎస్ బెట్వా, ఐఎన్​ఎస్ బియాస్ యుద్ధ నౌకలతో పాటు పీ8ఐ యుద్ధవిమానాన్ని రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
బాధితులను తరలిస్తున్న సిబ్బంది

తౌక్టే తుపాను కారణంగా సముద్రంలో మూడు నౌకలు, ఒక ఆయిల్ రిగ్​లో మొత్తం 707 మంది చిక్కుకున్నారని అధికారులు వివరించారు. పీ-305లో 273, కార్గో నౌకలో 137, ఎస్​ఎస్-3 నౌకలో 196, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లో 101 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయక చర్యలు ముమ్మరం

అయితే వీరిలో ఎస్ఎస్​-3నౌకలో ఉన్న 196 మందిని, జీఏఎల్ కన్స్​ట్రక్టర్​ నౌకలో 137, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లోని 101 మంది మంగళవారం రక్షించినట్లు తెలిపారు.

కన్నీటి పర్యంతం

నౌక నుంచి బయటపడ్డాక కన్నీటి పర్యంతం

పీ 305 నౌక నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత అందులోని ఓ వ్యక్తి నౌకాదళం సహాయక చర్యలపై మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదీ చదవండి :కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి

Last Updated : May 19, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details