తెలంగాణ

telangana

ETV Bharat / bharat

88 ఏళ్ల వయసులో సర్పంచ్​గా ఎన్నికైన బామ్మ - సర్పంచ్​ పీఠాన్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలు

జీవితానికి వయస్సనేది కేవలం సంఖ్య మాత్రమే.. తలచుకుంటే ఏ వయసులోనైనా అద్భుతాలు చేయగలమని నిరూపించిందో బామ్మ. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన దక్షిణాయమ్మ అనే 88ఏళ్ల బామ్మ సర్పంచ్​గా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

88 years old Grandmother becomes president of gram panchayat!
88 ఏళ్ల వయసులో సర్పంచ్​.. ప్రజలకు సేవ!

By

Published : Feb 17, 2021, 10:04 PM IST

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన దక్షిణాయమ్మ అనే 88ఏళ్ల బామ్మ గ్రామ సర్పంచ్​గా ఎన్నికైంది. జీవితంలో మొదటిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన బామ్మ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా గెలపొంది సర్పంచి పదవిని సొంతం చేసుకుంది.

88 ఏళ్ల వయసులో సర్పంచ్​.. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిజీబిజీగా బామ్మ..
88 ఏళ్ల వయసులో సర్పంచ్​.. గ్రామ పంచాయతీ సభ్యులతో బామ్మ..

అతిపెద్ద వయస్కురాలు..

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చిక్కఎమ్మిగనూరు పంచాయతీ వార్డుకు దక్షిణాయమ్మ పోటీ చేసింది. తన 88వ పడిలో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచిందీ బామ్మ. దీంతో రాష్ట్రంలో సర్పంచ్​ పీఠాన్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది.

గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తోన్న బామ్మ..

గ్రామాభివృద్ధికి కృషి..

ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆమె తన గ్రామాన్ని సందర్శిస్తోంది. ఆయా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. బామ్మ పని పట్ల గ్రామప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశేషమేమిటంటే.. 88 ఏళ్ల దక్షిణాయమ్మ ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదు.

ఇదీ చదవండి:ఎగిరే దోశకు 8 కోట్ల వ్యూస్​!

ABOUT THE AUTHOR

...view details