7th Pay Commission Report :ప్రభుత్వం.. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) ఇస్తుంది. ఇవి రెండూ సంవత్సరానికి రెండుసార్లు పెరుగుతాయి. క్యాలండర్ ఇయర్లో.. ప్రతీ సంవత్సరం జనవరిలో మొదటిసారి, జూలైలో రెండోసారి DA, DR పెరుగుతాయి. ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన పెంపును ఆలస్యంగా మార్చిలో అమలు చేశారు. 4 శాతం పెంచడంతో 38 నుంచి 42 శాతానికి పెరిగింది. అయితే.. జూలైలో చేపట్టాల్సిన పెంపు మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే కేంద్ర కెబినెట్ ఆమోద ముద్రవేయనుంది.
డీఏ ఎంత పెరుగనుంది..?
DA How Much For Central Govt Employees :
అయితే.. DA ఇంకా DR ఎంత పెరుగుతుంది అనే విషయంలో ఉద్యోగులు ఉత్కంఠగా ఉన్నారు. ఈ సారి కూడా నాలుగు శాతం పైన పెరుగుతుందని, పెరగాలని ఆశిస్తున్నప్పటికీ.. 3 శాతానికి మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. తాము నాలుగు శాతం డిమాండ్ చేస్తున్నామని.. కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా 3 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
Telangana government employees : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త.. ఆలవెన్స్ పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం.. ఈ డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు.. ధరలు ప్రజలపై పడుతున్న ప్రభావం వంటివి లెక్కలోకి తీసుకొని.. ఎంత పెంచితే బాగుంటుందన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్ చేసిన తర్వాత.. ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గానికి అందజేస్తుంది. ఆ ప్రతిపాదనను సెంట్రల్ కేబినెట్ పరిశీలించి.. ఎంత పెంచాలనే విషయమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
3 నుంచి 4 శాతం డీఏ..?