తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75 Years of Independence: 'భగత్'ను కాపాడిన నేలమాళిగ

ఉరికొయ్యను ముద్దాడి.. దేశంకోసం ప్రాణాలర్పించిన అకళంక దేశభక్తుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్‌ రహస్యజీవన కాలంలో అక్కున చేర్చుకున్న ఆ పాతాళ గృహం చరితార్ధమైంది. స్ఫూర్తిదాయక చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అదే తూర్పు బర్ధ్వాన్​లోని ఖాందాఘోష్​ సమీప ఉయారి గ్రామానికి చెందిన అరవింద్​ ఘోష్​ నేలమాళిక గృహం. భగత్​ సింగ్​తో పాటు బటుకేశ్వర్​ దత్​ను 15 రోజుల పాటు అందులోనే రహస్య జీవితం గడిపారు.

Underground basement in West Bengal
'భగత్' ను కాపాడిన నేలమాళిగ

By

Published : Oct 9, 2021, 6:06 AM IST

భగత్​ సింగ్​ను కాపాడిన నేలమాళిగ

ఒక నేలమాళిగ ఓ అగ్ని పర్వతాన్ని పక్షం రోజులు దాచుకుంది. భూమాత తన బిడ్డగా భావించింది కావచ్చు అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంది. భరతమాత విముక్తికి పోరాడుతున్న యోధుడి వ్యూహ రచనకు సహకరించింది. ఆ వీరుడే ఉరికొయ్యను ముద్దాడి.. దేశంకోసం ప్రాణాలర్పించిన అకళంక దేశభక్తుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్‌. రహస్యజీవన కాలంలో భగత్ సింగ్ ను అక్కున చేర్చుకున్న ఆ పాతాళ గృహం చరితార్ధమైంది. స్ఫూర్తిదాయక చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది.

భగత్​ సింగ్​ రహస్య జీవితం గడిపిన ఇల్లు

లాలా లజపత్ రాయ్ ని బలితీసుకున్నారన్న ఆగ్రహంతో బ్రిటీషర్లపై ప్రతీకారంకోసం అనుయాయులతో వేచి చూస్తున్నాడు భగత్ సింగ్‌. లజపత్ రాయ్‌ మృతికి కారణమైన బ్రిటిష్ పోలీసు అధికారి డెంట్‌ జేమ్స్ స్కాట్‌ హత్యకు పథకం వేశారు. కానీ పొరపాటున స్కాట్​కు బదులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాన్ శాండర్స్​ను హతమార్చారు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని నాటి ఉమ్మడి బర్ద్వాన్‌ జిల్లాకు పారిపోయారు. భగత్ సింగ్​తో పాటు ఆ పథకంలో భాగస్వామి అయిన బటుకేశ్వర్ దత్‌ పారిపోయారు. అంతటా పోలీసుల నిఘా. అప్పుడు బటుకేశ్వర దత్‌.. భగత్ సింగ్​ను తీసుకుని తూర్పు బర్ద్వాన్​లోని ఖాందాఘోష్ దగ్గర... తన స్వగ్రామం ఉయారికి చేరాడు. అక్కడ తన పూర్వీకుల ఇంటి పక్కనే ఉన్న అరవింద ఘోష్​కు చెందిన నేలమాళిగ గృహంలో భగత్ సింగ్, తను 15రోజుల రహస్య జీవితం గడిపారు.

శిథిలావస్థకు చేరిన నేలమాళిక ఇల్లు

" శాండర్స్​ను చంపిన తరువాత భగత్ సింగ్​కు సురక్షిత ప్రదేశం అవసరమైంది. అప్పుడు బటుకేశ్వర్ దత్ ఆయన్ని తనతో వాళ్ల ఊరు తీసుకెళ్లారు. మొదటిగా వారు రైలులో బర్ద్వాన్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడకన ఖందాఘోష్ వెళ్లారు. ముందుగా దత్‌ భగత్ సింగ్​ను తన పురాతన స్వగృహానికి తీసుకొచ్చారు. తర్వాత భూగర్భ గృహం అయితేనే సురక్షితమని భావించారు. అప్పుడు అలాంటి సదుపాయం ఉన్న పక్కింట్లో 15 రోజులు రహస్యజీవితం గడిపారు."

- డా. సరబ్ జిత్ జాష్‌, చరిత్రకారుడు

విప్లవకారులు బటుకేశ్వర్ దత్‌, భగత్ సింగ్ రహస్యంగా గడిపిన ఇంట్లో అనేక విశేషాలున్నాయి. అక్కడ రహస్య భూగర్భ నేలమాళిగ ఉంది. దిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడికి వీరు ఇక్కడే నమూనా పథకాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ అల్మారా నుంచి ఒక నేలమాళిగకు వెళ్లేందుకు ఒక రహస్యదారి ఉంది. ఇల్లు శిథిల స్థితికి చేరింది. ఈ దారంతా ఇప్పుడు గబ్బిలాల నిలయమైంది.

భగత్​ సింగ్​, బటుకేశ్వర్​ విగ్రహాలు

" ఇదే బటుకేశ్వర్ దత్ పూర్వీకుల ఇల్లు. ఘోష్‌ కుటుంబీకులది. ఘోష్ కుటుంబ ఇంటిపెద్ద అయిన ఓ మహిళ వీరికి భూగర్భ గృహంలో ఆశ్రయమిచ్చారు. బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ సెంట్రల్ లెజిస్లేటివ్ హౌస్​లో బాంబులు విసిరేందుకు ఈ ఇంట్లో ఉన్నప్పుడే పథకం వేశారు. పని పూర్తి చేయగానే ఇద్దరే ముందుగా స్థానిక రైల్వే స్టేషనుకు వెళ్లి.. బంకురా మీదుగా తప్పించుకుని పారిపోయారు."

- శంభునాథ్‌ దాస్

ఈ ఇల్లు క్రమంగా శిథిలమవుతోంది. అయినప్పటికీ ఎక్కువ భాగం ఇప్పటికీ నివాసయోగ్యంగానే ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ చారిత్రక గృహాన్ని సంరక్షించాలని ఘోష్ వారసులు విజ్ఞప్తిచేయగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

శిథిలావస్థకు చేరుకున్న నేలమాళిగ ఇల్లు

" ఈ ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మ్యూజియంగా మార్చాలని మేం కోరుతున్నాం. నష్ట పరిహారం ఇచ్చిన వెనువెంటనే ఇంటిని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం."

- రేఖా ఘోష్‌

ప్రభుత్వం ఈ గృహాన్ని స్వాధీనపర్చుకుని భద్రంగా వుంచాలని స్థానికులు కోరుతున్నారు.

" మేము ప్రభుత్వంతో, ఘోష్ కుటుంబ సభ్యులతో మాట్లాడాం. ప్రభుత్వం ఈ ఇంటిని స్వాధీనపర్చుకుని సంరక్షిస్తుందని మా ఉద్దేశం. స్వాధీన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం నోటీసు కూడా పంపించింది. ప్రభుత్వం ఇప్పుడు నిరభ్యంతర పత్రాలకోసం వేచి చూస్తోంది."

- మధుసూదన్ దత్తా, కార్యదర్శి, బటుకేశ్వర్ దత్ వెల్ఫేర్ ట్రస్టు

ఖాందా ఘోష్​లోని ఘోష్ ఇంట్లోనే స్వదేశీ ఉద్యమంలో ముఖ్య అధ్యాయాలకు వ్యూహరచన జరిగింది. ఆ ఇల్లు నాటి చరిత్రకు మేటి సాక్ష్యంగా, స్ఫూర్తిగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details