Uttarpradesh Rape News: ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో అమానవీయ ఘటన జరిగింది. 70 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు.
70 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిని అపహరించి.. అత్యాచారం - ఉత్తర్‌ప్రదేశ్ న్యూస్
Uttarpradesh Rape News: 70 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో జరిగింది. కాగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్లోని ఓ గ్రామంలో 70 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు నివసిస్తోంది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలంలో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను కుటుంబసభ్యులు గుర్తించారు. అనంతరం బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడి బట్టలపై రక్తపు మరకలు గమనించిన గ్రామస్థులు అతడిని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.
ఇదీ చదవండి:బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. స్కూల్ నుంచి వస్తుండగా..