తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జల విలయం- 62కు చేరిన మృతులు - ఉత్తరాఖండ్​ తాజా వార్తలు

ప్రకృతి ప్రకోపం సృష్టించిన ఉత్తరాఖండ్​ ఘటనలో ఇప్పటివరకు 62 మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. చమోలీ జిల్లా జోషిమఠ్​లోని తపోవన్​ సొరంగంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

62 bodies recovered till now following the glacial burst in Uttarakhand
ఉత్తరాఖండ్​ ప్రళయం- 62కు చేరిన మృతులు

By

Published : Feb 19, 2021, 9:57 AM IST

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 142 మంది గల్లంతవ్వగా.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు వివరించారు. ఈ మేరకు ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ బృందాలు.. చమోలీ జిల్లా జోషిమఠ్​లోని తపోవన్​ సొరంగ మార్గంలో సహాయక చర్యలు చేపట్టాయి.

మృతదేహాలను బయటకు తీసుకొస్తున్న రెస్క్యూ సిబ్బంది
తపోవన్​ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదీ చదవండి:శిథిలాల కుప్పతో రిషిగంగకు మరో ముప్పు!

జోషిమఠ్ వద్ద నందాదేవి హిమానీనదం బద్దలవ్వడం వల్ల రిషిగంగ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా సంగమం వద్ద ఉన్న ఎన్​టీపీసీకి చెందిన మరో జల విద్యుత్‌ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది.

ABOUT THE AUTHOR

...view details