రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లాలోని ఫలోదీ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు వెళుతోన్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగులు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఫలోదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బీఎస్ఎఫ్ ట్రక్కు బోల్తా.. ఆరుగురు జవాన్లకు గాయాలు - రాజస్థాన్ వార్తలు
రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లాలోని ఫలోదీ ప్రాంతంలో బీఎస్ఎఫ్కు చెందిన ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆరుగులు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఫలోదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బీఎస్ఎఫ్కు చెందిన ఓ ట్రక్కు బోల్తా
ఫలోదీలోని ఎక్లా మూల మలుపు వద్ద ట్రక్కుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను ఆసుపత్రిలో చేర్చారు.
ఇదీ చూడండి:అప్పుల బాధతో కుమారుడితో కలిసి రైతు ఆత్మహత్య