తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా - covid news haryana school

54 children of Sainik School found Corona positive in Karnal
ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా

By

Published : Mar 2, 2021, 3:16 PM IST

Updated : Mar 2, 2021, 5:36 PM IST

15:14 March 02

ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా

హరియాణా కర్నాల్ జిల్లా కుంజపురా​లోని సైనిక్​ స్కూల్​లో కరోనా కలకలం రేగింది. ఏకంగా 54 మంది విద్యార్థులకు వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయింది.

సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉన్న 390 విద్యార్థుల నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. అందులో 54 పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. 

కర్నాల్​లో కరోనా సంక్రమణం అదుపులోకి వచ్చిన సమయంలోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయని డా. యోగేశ్ శర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. 

Last Updated : Mar 2, 2021, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details