ఐదేళ్ల చిన్నారిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. బాలుడి తండ్రి అకాలమరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పోలీసు శాఖ తెలిపింది. ఆ చిన్నారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పూర్తి స్థాయి కానిస్టేబుల్‌గా నియమితులవుతారని ఎస్డీపీఓ ప్రకాశ్ సోనీ తెలిపారు. శనివారం ఉదయం చిన్నారికి నియామకపత్రంతో పాటుగా చాక్లెట్స్ని కూడా అందించారు సూరజ్‌పుర్ జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహు.
కానిస్టేబుల్‌గా ఐదేళ్ల చిన్నారి.. నియామక పత్రంతో పాటు చాక్లెట్స్.. - ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖ కారుణ్య నియామకం న్యూస్
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఓ ఐదేళ్ల చిన్నారిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించింది. కొన్ని రోజుల క్రితం ఎస్సైగా విధులు నిర్వర్తించే చిన్నారి తండ్రి మృతి చెందిన కారణంగా పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పోలీసులు శనివారం చిన్నారికి చాక్లెట్లతో పాటు నియామక పత్రం అందించారు.
ఇదీ జరిగింది
సూరజ్‌పుర్ జిల్లాకి చెందిన హరి ప్రసాద్ కొరియా జిల్లాలో ఎస్సైగా విధులు నిర్వర్తించేవారు. కొన్ని రోజుల క్రితం హరిప్రసాద్ మరణించారు. వెంటనే కారుణ్య నియామకం కింద వారి కుటుంబంలో ఒకరికి పోస్టింగ్ ఇవ్వాలని సుర్గుజా రేంజ్ ఐజీ రామ్‌గోపాల్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో వెంటనే సూరజ్‌పుర్ ఎస్పీ రామకృష్ణ సాహు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం ఉదయం చిన్నారి హరేంద్ర సింగ్ పంక్రాకు అతని తల్లి సమక్షంలో చైల్డ్ కానిస్టేబుల్‌గా నియామకపత్రం అందించారు జిల్లా ఎస్పీ. గతంలో కూడా సూరజ్‌పుర్ పోలీస్ శాఖ ఇదే తరహాలో ఓ చిన్నారిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించింది.