తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Exit Polls: పంజాబ్​లో కేజ్రీవాల్​ హిట్​- ఆప్​దే పీఠం!

ASSEMBLY ELECTIONS EXIT POLLS
ASSEMBLY ELECTIONS EXIT POLLS

By

Published : Mar 7, 2022, 6:04 PM IST

Updated : Mar 7, 2022, 7:51 PM IST

19:50 March 07

మినీ సార్వత్రికంలో విజేతలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి అధికారం భాజపాదేనని తేల్చాయి. మునుపటితో పోల్చితే సీట్లు తగ్గినప్పటికీ ఆ రాష్ట్రంలో కమలదళానికి మెజారిటీకి మించి సీట్లు వస్తాయని తెలిపాయి.

పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ పేర్కొన్నాయి. మణిపుర్​లో భాజపా అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఉత్తరాఖండ్​లో హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు, గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పోల్స్ అంచనా వేశాయి.

ఉత్తర్​ప్రదేశ్- విజేత

భాజపామ్యాట్రైజ్ పోల్ ప్రకారం యూపీలో భాజపాకు 262 నుంచి 277 సీట్లు రానున్నాయి. సమాజ్​వాదీ పార్టీకి 119 నుంచి 134 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీకి 7-15, కాంగ్రెస్​కు 3-8 వరకు రానున్నట్లు పోల్స్​లో వెల్లడైంది.

పీ-మార్క్ ప్రకారం యూపీలో భాజపాకు 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్​కు 4 స్థానాలు రానున్నాయి. ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని పీ-మార్క్ పోల్ అంచనా వేసింది.

పంజాబ్- విజేత ఆమ్ ఆద్మీ

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్​లో ప్రభంజనం సృష్టించనుందని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్​లో మెజారిటీకి 59 స్థానాలు అవసరం కాగా.. ఆప్ అంతకుముంచి సీట్లను గెలుచుకోనుందని పోల్స్ పేర్కొన్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఉంది. భాజపాకు కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఉత్తరాఖండ్​లో హోరాహోరీ!

మరోవైపు, ఉత్తరాఖండ్​లో భాజపా-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఏబీపీ-సీఓటర్ అంచనాల ప్రకారం భాజపాకు 26-32 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్​కు 32 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి 36 స్థానాలు అవసరం.టైమ్స్‌ నౌ- వీటో అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్​లో భాజపాకు 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుచుకోనుంది.

గోవాలో హంగ్​..

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గోవాలో హంగ్ ఏర్పడనుంది. ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్​లో తేలింది.

మణిపుర్​లో ఆధిక్యంలో భాజపా

మణిపుర్​లో భాజపా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​తో పోలిస్తే అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.

19:11 March 07

మణిపుర్​లో మొత్తం స్థానాలు- 60

జన్‌కీ బాత్‌ ఇండియా న్యూస్‌ ఎగ్జిట్‌పోల్‌

  • భాజపా 23-28
  • కాంగ్రెస్‌ 10-14
  • ఎన్‌పీపీ 07-08
  • ఎన్‌పీఎఫ్‌ 05-07
  • జేడీయూ 05-07
  • ఇతరులు 02-03

19:08 March 07

పంజాబ్​లో​ ఆప్​ హవా

మొత్తం స్థానాలు‌-117

ఏబీపీ- సీ ఓటర్

  • ఆప్ 51-61
  • కాంగ్రెస్ 22-28
  • అకాలీదళ్‌+ 20-26
  • భాజపా+ 7-13
  • ఇతరులు 1-5

యాక్సిస్ మై ఇండియా

  • ఆప్ 76-90
  • కాంగ్రెస్ 19-31
  • అకాలీదళ్‌+ 7-11
  • భాజపా+ 1-4
  • ఇతరులు 0-2

జన్‌ కీ బాత్

  • ఆప్‌ 60-84
  • కాంగ్రెస్‌ 18-31
  • అకాలీదళ్‌+ 12-19
  • భాజపా+ 3-7
  • ఇతరులు 0

ఇండియా టుడే

  • ఆప్‌ 76-90
  • కాంగ్రెస్‌ 19-31
  • అకాలీదళ్‌+ 0
  • భాజపా+ 0
  • ఇతరులు 0

పీ మార్క్

  • ఆప్‌ 62-70
  • కాంగ్రెస్‌ 23-31
  • అకాలీదళ్‌+ 16-24
  • భాజపా+ 1-3
  • ఇతరులు 1-3

ఆత్మసాక్షి

  • ఆప్‌ 34-38
  • కాంగ్రెస్‌ 58-61
  • అకాలీదళ్‌+ 18-21
  • భాజపా+ 4-5
  • ఇతరులు 0

18:58 March 07

గోవాలో వైపే మొగ్గు

సీఎన్‌ఎక్స్‌ అంచనాలు

  • భాజాపా 11-16
  • కాంగ్రెస్‌ 11-17
  • ఆప్‌ 0-02
  • ఇతరులు 05-07

జన్‌కీ బాత్‌ ఇండియా న్యూస్‌ ఎగ్జిట్‌పోల్‌

  • భాజపా 13-19
  • కాంగ్రెస్‌ 14-19
  • ఆప్‌ 01-02
  • ఇతరులు 04-08

18:52 March 07

ఉత్తరాఖండ్​లో హోరాహోరీ

ఏబీపీ- సీ ఓటర్‌

  • భాజపా 26-32
  • కాంగ్రెస్‌ 32-38
  • ఆప్‌- 0-2,
  • ఇతరులు 3-7

టు-డేస్‌ చాణక్య

  • భాజపా 36-50
  • కాంగ్రెస్‌ 17-31
  • ఆప్‌- 0
  • బీఎస్పీ- 0
  • ఇతరులు 0-6

జన్‌కీ బాత్‌

  • భాజపా 32-41
  • కాంగ్రెస్‌ 27-35
  • ఆప్‌- 0-1,
  • బీఎస్బీ 0-1
  • ఇతరులు 3

టైమ్స్‌ నౌ- వీటో

  • భాజపా 37
  • కాంగ్రెస్‌ 31
  • ఆప్‌- 1,
  • ఇతరులు 1

మ్యాట్ర్జిజ్‌

  • భాజపా- 29-34
  • కాంగ్రెస్‌ 33-38
  • బీఎస్పీ 1-3
  • ఆప్‌- 0
  • ఇతరులు 1-3

18:45 March 07

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో యూపీలో ఓటర్లు మళ్లీ భాజపాకే అధికారాన్ని కట్టబెట్టనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి.

ఉత్తర్‌ప్రదేశ్​లో మొత్తం సీట్లు- 403

పోల్‌స్ట్రాట్‌

  • భాజపా+ 211-225
  • సమాజ్‌వాదీ+ 146-160
  • బీఎస్పీ 14-24
  • కాంగ్రెస్‌ 4-6

సీఎన్ఎన్‌ న్యూస్‌ 18

  • భాజపా+ 240
  • సమాజ్‌వాదీ+ 140
  • బీఎస్పీ 17
  • కాంగ్రెస్‌ -
  • ఇతరులు 6

ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్‌

  • భాజపా+ 138-140
  • సమాజ్‌వాదీ+ 235-240
  • బీఎస్పీ 19-23
  • కాంగ్రెస్‌ 12-16
  • ఇతరులు 1-2

పీ-మార్క్‌

  • భాజపా+ 225-255
  • సమాజ్‌వాదీ+ 130-150
  • బీఎస్పీ 12-22
  • కాంగ్రెస్‌ 2-6
  • ఇతరులు 0-4

మ్యాట్రిజ్ ఎగ్జిట్‌పోల్‌

  • భాజపా+ 262-277
  • సమాజ్‌వాదీ+ 119-134
  • బీఎస్పీ 7-15
  • కాంగ్రెస్‌ 3-8
  • ఇతరులు 0

17:42 March 07

ఎగ్జిట్ పోల్స్ లైవ్

EXIT POLLS LIVE UPDATES: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్​తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి. సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి.

తాజా అసెంబ్లీ ఎన్నికలపై కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మెజార్టీ సీట్లు రానున్నాయనేది తేలిపోనుంది.

ఇదీ చదవండి:రాష్ట్రపతి ఎన్నికపై.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఎంత?

Last Updated : Mar 7, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details