తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెస్ పండగ షురూ.. మోదీ చేతుల మీదగా ఒలింపియాడ్​ పోటీలు ప్రారంభం - ఇండియా చెస్ ఒలింపియాడ్

44th Chess Olympiad: 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్ పాల్గొన్నారు.

44th-chess-olympiad-pm-inauguration
44th-chess-olympiad-pm-inauguration

By

Published : Jul 28, 2022, 6:49 PM IST

Updated : Jul 29, 2022, 11:50 AM IST

Chess Olympiad PM Modi: 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్​ పోటీలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. క్రీడల్లో పరాజితులు ఉండరని పేర్కొన్నారు. క్రీడల్లో కేవలం విజేతలు, భవిష్యత్ విజేతలే ఉంటారని చెప్పారు. టోర్నీకి తక్కువ సమయమే ఉన్నప్పటికీ నిర్వాహకులు మెరుగైన ఏర్పాట్లు చేశారని కొనియాడారు. అతిథి దేవోభవ అన్న నినాదాన్ని ఉటంకిస్తూ ఆటగాళ్లందరికీ ఉత్తమ ఆతిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​, సూపర్​స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియంలో ఎక్కడ చూసినా నలుపు, తెలుపు గడులు కనిపించేలా తీర్చిదిద్దారు. భారీ చెస్ పావులను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మోదీతో స్టాలిన్
రజినీకాంత్
మోదీ, స్టాలిన్ సైకత చిత్రం

ఉక్రెయిన్​పై దండయాత్రకు దిగిన రష్యాపై వేటు పడడం వల్ల.. అనూహ్యంగా ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకుంది భారత్. దీంతో పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో.. ఓపెన్‌, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్‌ ఆరు జట్లను బరిలోకి దించుతోంది. తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. ద్రోణవల్లి హారిక ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పటికీ పోటీల్లో పాల్గొంటుండటం విశేషం.

ద్రోణవల్లి హారిక

రష్యా, చైనా బరిలో లేనందున స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్‌కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ఇంకా ఉక్రెయిన్‌, హంగేరీ, నార్వే కూడా బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ఛాంప్‌ కార్ల్‌సన్‌ నార్వే జట్టుకు ఆడుతున్నాడు. అతను టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఈసారి పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌.. భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 29, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details