దేశవ్యాప్తంగా ఉన్న 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1), (2), (3) కింద కోర్టులు నేరాభియోగాలు నమోదు చేసినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ (ADR report) వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు 2,495 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన ప్రమాణ పత్రాలను పరీక్షించి ఆ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 296 మంది ఎమ్మెల్యేలు, 67 మంది ఎంపీలు ఉన్నారు.
ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 8(1), (2), (3)ల కింద కేసులు ఎదుర్కొంటున్నవారికి శిక్షపడ్డ రోజు నుంచే అనర్హత మొదలవుతుంది. మళ్లీ వారు విడుదలైన రోజు నుంచి ఆరేళ్లపాటు ఆ అనర్హత కొనసాగుతుంది. ఈ సెక్షన్ల కింద ఉన్నవన్నీ తీవ్రమైన, హీనమైన నేరాలే. అన్నీ భారతీయ నేర స్మృతి పరిధిలోకి వచ్చేవే. హత్య, అత్యాచారం, దోపిడీ, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు, లంచం, అనుచిత ప్రభావం, కులాలు, మతాలు, జాతి, భాష, ప్రాంతం ప్రాతిపదికన వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంలాంటి నేరాలు ఈ సెక్షన్ల పరిధిలో ఉంటాయి.
ఈ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా 83 మంది భాజపా సభ్యులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (47), తృణమూల్ కాంగ్రెస్ (25), వైకాపా (22), బీజేడీ (22)లు ఉన్నాయి. ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీలు అత్యధికంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 54 మంది, 2021 కేరళ ఎన్నికల్లో గెలిచిన వారిలో 42 మంది ఎమ్మెల్యేలు ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రుల్లో నలుగురు, వివిధ రాష్ట్రాల మంత్రుల్లోని 35 మందిపై ఇలాంటి నేరాభియోగాలు నమోదయ్యాయి. ఎంపీలపై నమోదైన కేసులు సగటున 7 ఏళ్లుగా, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు (ADR report) సగటున ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.
వైకాపాలో..