దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 35,726 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి ఒక్క రోజులోనే 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి బారిన పడిన వారిలో మరో 14, 523 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఆదివారం నుంచి అమలు కానున్నాయి.
మహారాష్ట్రలో కేసులు
- మొత్తం కేసులు - 26,73,461
- మొత్తం రికవరీలు - 23,14,579
- మొత్తం మరణాలు - 54,073
- యాక్టివ్ కేసులు - 3,03,475
ముంబయిలో కేసులు
ముంబయిలో వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. శవివారం 6,123 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,294 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు - 3,91,751
- మొత్తం రికవరీలు - 3,37,555
- మొత్తం మరణాలు - 11,641
- యాక్టివ్ కేసులు - 41,609
దిల్లీలో కేసులు