తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

Char Dham Yatra: ఈ ఏడాది చార్​ధామ్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల వీరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Char Dham Yatra
చార్​ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి

By

Published : May 14, 2022, 1:52 PM IST

Char Dham Yatra pilgrims death: ఈ ఏడాది మే 3వ తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి మే 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో ఛార్​ధామ్​ యాత్ర మార్గాల్లో భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్​ జనరల్​ డా.శైలజ భట్ వివరించారు.

సీఎం సూచన మేరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చార్​ధామ్​ యాత్రలో పాల్గొనే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శైలజ పేర్కొన్నారు. పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారికి విశ్రాంతి తీసుకొమని చెప్పి, పరిస్థితి మెరుగుపడ్డాకే యాత్రలో పాల్గొనాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

అక్షయ తృతీయ సందర్భంగా మే 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరిచి చార్​ధామ్ యాత్ర ప్రారంభించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మే 6న కేదార్​నాథ్​, 8న బద్రీనాథ్​ ఆలయాలను తెరిచారు.

ఇదీ చదవండి:'నా చిలక ఎగిరిపోయింది.. ఎలాగైనా వెతికిపెట్టండి సార్​'

ABOUT THE AUTHOR

...view details