మయన్మార్‌లో సైనిక హింసను తట్టుకోలేక శరణార్థులుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు ఆ దేశ పౌరులు. శుక్రవారం ముగ్గురు మయన్మార్ జాతీయులు అసోంలోని సరిహద్దు ప్రాంతంలోకి వచ్చారు. తీవ్రమైన బులెట్ గాయాలతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు స్థానిక అధికారులు.
గత గురువారం రాత్రి సుమారు 12 మంది మయన్మార్ వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించారని స్థానిక పోలీసులు తెలిపారు. సరిహద్దులో మయన్మార్ దళాలు ప్రజలపై కాల్పులకు తెగబడటం వల్ల వారు ఆ దేశం విడిచి పారిపోతున్నారని చెప్పారు. భారత్‌లోని సరిహద్దు ప్రాంతమైన మోరేలో వారికి స్థానికులు ఆశ్రయం కల్పించారని వెల్లడించారు.
శుక్రవారం ఎనిమిది మందిని తిరిగి మయన్మార్‌కు పంపించినట్లు పోలీసు అధికారి విక్రమ్జీ సింగ్ చెప్పారు. గాయపడ్డవారికి మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.