Punjab Election News: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీలకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆమ్ అద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal News) అన్నారు. ఈ క్రమంలో వారిని చెత్తతో పోల్చిన ఆయన.. వారిని చేర్చుకోవడం అనవసరమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్‌లో పర్యటించిన కేజ్రీవాల్.. అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలోనే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు. ఇది సాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి వారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆప్‌లోకి వచ్చేందుకు మాతో టచ్‌లో ఉన్నారు. కానీ వారు మాకు అవసరం లేదు. ఆ బ్యాచ్ అంతా చెత్త."