తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు - ఆక్సిజన్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి భారత్‌ ప్రాణవాయువును దిగుమతి చేసుకుంటోంది. పొరుగు దేశాల నుంచి త్వరలోనే వాయుమార్గంలో 24 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు భారత్‌కు బయలు దేరుతున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మరోవైపు ఆక్సిజన్‌ను దిగుమతి చేసేందుకు భారత్‌ ప్రభుత్వం సింగపూర్‌తోనూ సంప్రదింపులు జరిపింది. దాంతో నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు సింగపూర్ నుంచి భారత్ కు వచ్చాయి.

oxygen
ఆక్సిజన్

By

Published : Apr 24, 2021, 9:44 PM IST

దేశంలో ఆక్సిజన్‌ కొరత తారస్థాయికి చేరిన వేళ సింగపూర్‌ నుంచి నాలుగు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు భారత్‌కు చేరుకున్నాయి. ఈ మేరకు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కోసం సింగపూర్‌ వెళ్లిన వాయుసేన విమానాలు భారత్‌కి చేరుకున్నాయి. సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయం నుంచి ఆక్సిజన్‌తో బయలు దేరిన వాయుసేనకు చెందిన సీ17 విమానం ఇవాళ సాయంత్రం నాలున్నర గంటలకు బెంగాల్‌లోని పనాగర్‌ వైమానిక స్థావరానికి చేరుకుంది.

క్రయోజెనిక్‌ కంటైనర్లు
విమానంలో క్రయోజెనిక్‌ కంటైనర్లు
క్రయోజెనిక్‌ కంటైనర్లు

అంతకుముందు ఆక్సిజన్‌ కోసం సీ17 విమానం సింగపూర్‌కు వెళ్లినట్లు రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ను భారత్‌కు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. కరోనా ఉధృతితో వైద్య ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడటంతో విదేశాల నుంచి ఆక్సిజన్‌ల దిగుమతికి కేంద్రం చర్యలు చేపట్టింది.

పొరుగు దేశాల నుంచి త్వరలోనే వాయుమార్గంలో 24 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు భారత్‌కు బయలు దేరుతున్నట్లు ఐటీసీ లిమిటెడ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అందులో భాగంగా సింగపూర్ నుంచి నాలుగు క్రయోజనిక్ ఆక్సిజన్‌ ట్యాంకర్లు బంగాల్ కు చేరుకున్నాయి. ఇంకా 20 క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్ లు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంది.

అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు రక్షణ శాఖ కూడా చర్యలు మొదలు పెట్టింది. జర్మనీ నుంచి 23 మొబైల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో వారం రోజుల్లో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. గత మూడు రోజులుగా భారత్‌లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో చాలా ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ ప్రణాళికలు తయారు చేస్తోంది.

ఇదీ చదవండి:టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details