తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్​లో ప్రేమ.. మాట్లాడడం లేదని కోపం.. 51సార్లు స్క్రూడ్రైవర్​తో ఆమెను పొడిచి.. - girl killed by stabbing 51 times with screwdriver

20 ఏళ్ల అమ్మాయిని స్క్రూడ్రైవర్​తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. తనతో మాట్లాడటం మానేసిందని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఛత్తీస్​గఢ్​లో జరిగిందీ ఘటన. మరోవైపు.. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు స్నేహితులు. ఆమెను గదిలో బంధించి, తాళ్లతో కట్టేసి నాలుగు రోజుల పాటు అఘాయిత్యం చేశారు. చండీగఢ్​లో ఈ ఘటన జరిగింది.

girl killed by stabbing 51 times with screwdriver
51 సార్లు స్క్రూడ్రైవర్​తో పొడిచి యువతి హత్

By

Published : Dec 27, 2022, 5:59 PM IST

Updated : Dec 27, 2022, 6:20 PM IST

మాట్లాడటం మానేసిందని 20 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపాడు ఓ వక్తి. 51 సార్లు స్క్రూడ్రైవర్​తో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఛత్తీస్​గఢ్​లో ఈ ఘోరం జరిగింది. డిసెంబర్ 24న కోర్బా జిల్లాలోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ పంప్ హౌస్ కాలనీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు జష్పుర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడికి మూడేళ్ల క్రితం బాధిత యువతితో పరిచయం ఏర్పడింది. అప్పుడు నిందితుడు బస్​ కండక్టర్​గా పనిచేస్తున్నాడు. బాధిత అమ్మాయి తరచూ.. నిందితుడు పనిచేసే బస్సులో ప్రయాణం చేస్తూ ఉండేది.

కొద్ది రోజుల క్రితం నిందితుడు.. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో స్థిరపడ్డాడు. అయినా ఇద్దరు ఫోన్​లో మాట్లాడుకునే వారు. తరువాత బాధిత యువతి అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్​ 24న ఎవ్వరూ లేని సమయంలో యువతి ఇంటికెళ్లాడు. ఆమెపై దాడి చేశాడు. అరవకుండా దిండును నోటికి అడ్డుగా పెట్టాడు. స్క్రూడ్రైవర్​తో 51 సార్లు పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి ఇంటికొచ్చిన బాధితురాలి సోదరుడు రక్తపు మడుగులో ఉన్న సోదరిని గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. నిందితుడి కోసం వెతుకుతున్నారు.

యువతిపై ఇద్దరి స్నేహితుల సామూహిక అత్యాచారం..
చండీగఢ్​లో ఘోరం జరిగింది. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు స్నేహితులు. నాలుగు రోజుల పాటు ఆమెను బంధించి, తాళ్లతో కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సన్నీ, పర్వీందర్ సింగ్​ అనే ఇద్దరు స్నేహితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వీరిద్దరు పంజాబ్​కు చెందిన వారు. వీరు చండీగఢ్​లోని సెక్టార్ 39లో నివాసం ఉంటున్నారు. బాధిత యువతి హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన అమ్మాయి. నెల రోజుల క్రితం మొహాలికి పని కోసం వచ్చింది. తన ఫ్రెండ్​తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటుంది.
నిందితుల్లో ఒకడైన సన్నీకి.. ఆ యువతితో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరుతో ఆ అమ్మాయి దగ్గరయ్యాడు సన్నీ. నాలుగు రోజుల క్రితం.. మళ్లీ రావచ్చంటూ ఆ యువతిని తన రూంకు తీసుకెళ్లాడు సన్నీ. అనంతరం తన స్నేహితుడు పర్వీందర్ సింగ్​తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మొదట సన్నీ అత్యాచారం చేయగా.. ఆ తరువాత బాధితురాలిని కట్టేసి పర్వీందర్ సింగ్​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. అనంతరం దాడులు జరిపిన పోలీసులు.. పర్వీందర్ సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు. సన్నీ మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

13 ఏళ్ల బాలికపై అత్యాచారం..
చిత్ర పరిశ్రమలో అవకాశం ఇప్పిస్తానని 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ వ్యాపారవేత్త. మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో ఈ దారుణం జరిగింది. బికినీలో బాలికను డాన్స్​ చేయమని చెప్పి.. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు నిందితుడు.

పోలీసుల కథనం ప్రకారం.. అలెఫాటా ప్రాంతానికి చెందిన బాలికపై రాజేంద్ర దగ్దు గైక్వాడ్‌ అనే వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు. ఈ సంవత్సరం జూన్ 13 బాలికను ఆడిషన్​కు తీసుకెళ్లాలని ఆమెతో పాటు తల్లిదండ్రులను పుణెలోని ఓ హోటల్ గదికి పిలిచాడు నిందితుడు. అనంతరం ఆడిషన్‌లో భాగమని చెప్పి.. ఆమె తల్లిదండ్రులను బయటకు పంపి, రూంలో ఒంటరిగా అమ్మాయితో డాన్స్ చేయించాడు.

నవంబర్ 8న గైక్వాడ్, బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. పని మీద అలెఫాటాకు వస్తున్నానని అతనితో చెప్పాడు. బాలిక ఇంటికొచ్చిన గైక్వాడ్.. ఆమె డాన్స్​లో మెరుగుపడిందో లేదో చూస్తానని తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు పంపించాడు. అమ్మాయిని రూంలో ఒంటరిగా బికినీలో డాన్స్​ చేయించాడు. అనంతరం వెనుక నుంచి వచ్చి బాలికను గట్టిగా పట్టుకున్నాడు.

ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించింది. దీంతో బాలికను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని వారు వెల్లడించారు.

Last Updated : Dec 27, 2022, 6:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details