omicron variant news: దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు (coronavirus bangalore) తేలింది. ఆ దేశంలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్ వైరస్ వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న తరుణం.. ఈ వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఆ ఇద్దరు బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. పరీక్షలు నిర్వహించగా.. ఆ ఇద్దరికి సోకింది ఒమిక్రాన్ కాదని.. డెల్టా వేరియంట్ అని తేలింది.
"ఈ నెల 1 నుంచి 26వరకు మొత్తం మీద 584 మంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో 94మంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వాళ్లకి పరీక్షలు జరపగా.. కేవలం ఇద్దరికే వైరస్ నిర్ధరణ అయ్యింది. తదుపరి పరీక్షల కోసం వారి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించాము. పరీక్షల్లో వారికి డెల్టా వైరస్ సోకిందని తేలింది," అని బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ వెల్లడించారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు క్వారంటైన్లో ఉన్నట్టు, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.