తెలంగాణ

telangana

తల్లి ప్రేమకు కరిగిన ఉగ్రవాదులు.. దక్కిన ప్రాణాలు.. ఆయుధాలు విడిచి!

By

Published : Jul 6, 2022, 9:33 AM IST

Updated : Jul 6, 2022, 6:51 PM IST

Two Millitants Surrendered: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముష్కర వేట కొనసాగిస్తున్నాయి. ఉగ్రమూకలు ఎక్కడ నక్కినా వెంటాడుతున్న భద్రతా దళాలు వారికి గట్టి గుణపాఠం చెబుతున్నాయి. ఓ వైపు ఉగ్రవాదుల వేట కొనసాగిస్తూనే మరోవైపు వారు లొంగిపోయేందుకు కూడా సైన్యం అవకాశమిస్తోంది. ఈ క్రమంలోనే కుల్గాం జిల్లాలో ఆసక్తికర పరిణామం జరిగింది. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ముష్కరులు ఆయుధాలు విడిచి పోలీసుల ముందు లొంగిపోయారు.

Jk_kul03_2 newly_recruited_militants surrender_jk10022
Jk_kul03_2 newly_recruited_militants surrender_jk10022

Two Millitants Surrendered: ఇది తప్పుదారి పట్టిన తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడుతున్న ఆవేదన. పోలీసుల ముందు లొంగిపోవాలని ఉగ్రవాదిగా మారిన తన కుమారుడిని ఓ అమ్మ వేడుకుంటున్న దృశ్యమిది. ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించే తల్లి ప్రేమ ఆ ఉగ్రవాది మనసును మార్చేసింది. తాను చేసిన తప్పు తెలుసుకున్న ఆ ముష్కరుడు.. తల్లిదండ్రుల మాట విని పోలీసుల ముందు లొంగిపోయాడు. కుల్గాంలో జరిగిన రెండు ఘటనల్లో ఇద్దరు ముష్కరులు తల్లిదండ్రుల మాట విని లొంగిపోయారు.

భద్రతా బలగాలు గుర్తించిన అనుమానాస్పద వస్తువు

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చేరవేసి వారు లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించాయి. తల్లిదండ్రులు బతిమాలడంతో ఆ ఇద్దరు ముష్కరులు లొంగిపోయారు. అనంతరం వారి నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన ఇద్దరు ముష్కరులు ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉందని, అందుకే ఇంకా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు భారత బలగాలు వెల్లడించాయి.

ఘటనాస్థలిలో జాగిలం

ఎన్‌కౌంటర్‌ చేయకుండా ఇద్దరి ప్రాణాలను రక్షించామని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని, హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇద్దరి ప్రాణాలు రక్షించినట్లే తల్లిదండ్రులు సహకరిస్తే వందల మంది ప్రాణాలను కూడా కాపాడవచ్చని విజయ్‌కుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి:గాలి నింపుతుండగా భారీ పేలుడు.. అంతెత్తున ఎగిరిపడి అక్కడికక్కడే!

యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతురు.. వైమానిక దళ చరిత్రలోనే.

Last Updated : Jul 6, 2022, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details