తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మినీ సమరం'లో 18 శాతం మంది నేరచరితులే

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల కూటమి (ఏడీఆర్) తెలిపింది. 6,318 మందిలో 1,157 మంది తమపై క్రిమినల్ అభియోగాలు ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది.

adr report, ఏడీఆర్​ నివేదిక ఎన్నికలు
ఏడీఆర్

By

Published : Apr 1, 2021, 6:41 PM IST

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 18 శాతం మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల కూటమి (ఏడీఆర్) తెలిపింది. ఈ మేరకు సదరు నేతలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. వచ్చిన 6,792 అఫిడవిట్లలో 6,318 పత్రాలను పరిశీలించి.. ఈ వివరాలు గుర్తించినట్లు చెప్పింది.

ఈ 6,318 మందిలో 1,157 మంది తమపై క్రిమినల్ అభియోగాలు ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. 632 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. బంగాల్​లో మూడో దశ వరకు పరిశీలిస్తే అత్యధికంగా 144 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లే. తమిళనాడులో 466 మంది, కేరళలో 355 మంది, అసోంలో 138 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వివరించింది. ఈ 5 రాష్ట్రాల్లో పోటీలో ఉన్న వారిలో 1,317 మంది కోటీశ్వరులు ఉన్నారు.

ఇదీ చదవండి :'బంగాల్​లో భాజపా గాలి- 200+ సీట్లు మావే'

ABOUT THE AUTHOR

...view details