తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు 170 మంది ఎమ్మెల్యేలు గుడ్​బై - భాజపా

2016-20 మధ్య జరిగిన ఎన్నికల సమయాల్లో మొత్తం 405 ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో అత్యధికంగా 170మంది కాంగ్రెస్​ నుంచే ఉన్నట్లు అసోసియేషన్​ ఫర్​​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​​(ఏడీఆర్​) వెల్లడించింది. 18మంది ఎమ్మెల్యేలు మాత్రమే భాజపా నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినట్లు తెలిపింది.

170 MLAs left Cong to join other parties during polls held between 2016-2020: ADR
కాంగ్రెస్​కు షాక్​.. పార్టీ మారిన 170మంది ఎమ్మెల్యేలు

By

Published : Mar 11, 2021, 5:51 PM IST

2016-20 మధ్య ఎన్నికలు జరిగిన సమయాల్లో ఏకంగా 170 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సొంత పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇదే సమయంలో భాజపాను వీడిన శాసనసభ్యుల సంఖ్య 18 మాత్రమేనని వెల్లడైంది.

2016-2020 మధ్య ఎన్నికల సమయాల్లో పార్టీలు మారి, తిరిగి పోటీ చేసిన 433 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణపత్రాలు విశ్లేషించి ఈమేరకు నివేదిక రూపొందించింది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​​(ఏడీఆర్​). వీరిలో 405 మంది ఎమ్మెల్యేలు తెలిపింది. ఇందులో అత్యధికంగా 182 మంది భాజపాలో చేరగా... ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లోకి 38 మంది, తెరాసలోకి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని పేర్కొంది.

ఎన్నికల ముందు 16 మంది రాజ్యసభ సభ్యుల్లో 10మంది భాజపాలో చేరారని వెల్లడించింది. 12 మంది లోక్​సభ సభ్యుల్లో ఐదుగురు కాంగ్రెస్​లోకి వెళ్లినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:కాంగ్రెస్​కు సీనియర్​ నేత చాకో రాజీనామా

ABOUT THE AUTHOR

...view details