బుద్ధి మాంద్యం (ఆటిజం)పై అవగాహన కల్పించేందుకు పెద్ద సాహసమే చేసింది ఓ 12 ఏళ్ల బాలిక. అరేబియా సముద్రంలో 8గంటల 40 నిమిషాల్లో.. 36 కిలోమీటర్లు ఈది ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహారాష్ట్రలోని బంద్రా-వర్లీ సముద్ర లింక్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు స్విమ్మింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనలాంటి వారికి సాయంగా నిలవాలని అభ్యర్థించేందుకు ఈ సాహసం చేసింది.
జియా రాయ్ అనే బాలిక.. నావికాదళంలో పనిచేస్తోన్న మదన్ రాయ్ కుమార్తె. ఆమె కూడా ఆటిజంతో బాధపడుతోంది. నౌకాదళ చిన్నారుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది రియా.
"ఇది సరికొత్త ప్రపంచ రికార్డు. గత ఏడాది ఆటిజంతో బాధపడుతున్న అతిపిన్న వయస్కురాలిగా సముద్రంలో 14 కిలోమీటర్లు ఈదింది జియా. ప్రస్తుతం చేసిన సాహసాన్ని సంబంధిత విభాగాలు గుర్తించాయి. "