తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్​ కొరతతో 11 మంది కొవిడ్ రోగులు మృతి

మెడికల్ ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు ఆసుపత్రిలోనే ప్రాాణాలు విడిచారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

oxygen deficiancy
ఆక్సిజన్

By

Published : May 5, 2021, 7:06 AM IST

Updated : May 5, 2021, 7:40 AM IST

తమిళనాడులో విషాదం ఘటన జరిగింది. చెంగళపట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది కొవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

11 మంది మృతి

చెంగళపట్టు జిల్లాలో రోజుకు 1500 మందికిపైగా వైరస్​ బారినపడుతున్నారు. 500 మందికిపైగా చెంగళపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి బుధవారం తెల్లవారే సరికి 11 మంది ప్రాణావాయువు అందక మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే ఈ ప్రాంతంలో అధికంగా 1608 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రైవేటు అంబులెన్స్​లను ఉపయోగించింది తమిళనాడు ప్రభుత్వం. ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రికి ఆక్సిజన్ అందించగలిగారు జిల్లా అధికార యంత్రాంగం. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సిజన్​ లేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి:'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

Last Updated : May 5, 2021, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details