తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెయ్యేళ్ల నాటి శివలింగం స్వాధీనం- విలువ రూ.500 కోట్లు! - వెయ్యేళ్ల నాటి శివలింగం

500 crore Emerald Lingam: వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తంజావూరులో ఈ శివలింగం బయటపడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

Emerald lingam recovered in Tamil Nadu
వెయ్యేళ్ల నాటి శివలింగం

By

Published : Jan 1, 2022, 6:15 PM IST

Emerald Lingam Tamil Nadu: చోళ రాజుల కాలానికి చెందిన అరుదైన మరకత శివలింగాన్ని తమిళనాడు అక్రమ రవాణా నిరోధక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చోళుల రాజధాని అయిన తంజావూరులో దీన్ని గుర్తించారు.

అరులానంద ప్రాంతంలో నివాసం ఉండే సామియాపన్ ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డిసెంబర్ 30న సామియాపన్ ఇంట్లో సోదాలు జరిపారు. మరకత శివలింగం బయటపడగా.. దానికి సంబంధించిన ధ్రువపత్రాలేవీ సామియాపన్ వద్ద లేవని అధికారులు గుర్తించారు. దీంతో విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

500 crore Lingam seized

నిపుణులు పరిశీలించి.. శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది వెయ్యేళ్ల నాటిదని భావిస్తున్నారు. ఈ శివలింగాన్ని ముసుకుంత చోళ రాజు దానం చేశారని నిపుణులు చెబుతున్నారు. ఈ శివలింగం ఏ మందిరానికి చెందినదే విషయం తెలియలేదని అధికారులు తెలిపారు. ఈ విగ్రహం చోరీ చేసిందేనా? విదేశాలకు ఎగుమతి చేయాలని పథకం రచించారా? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.

తంజావూరుతో పాటు తిరుకువలై, తిరుక్కారవసల్, తిరునల్లార్, నాగపట్టిణం, వేదారణ్యం, తిరువరూర్ ప్రాంతాల్లోని శివాలయాల్లో మరకత లింగాలు దర్శనమిస్తాయి. పురాతన కాలానికి చెందిన ఈ విగ్రహాల విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్​ జవాన్లు

ABOUT THE AUTHOR

...view details