తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ ఉగ్ర కుట్ర భగ్నం- 10 కిలోల ఐఈడీ స్వాధీనం - militancy case

జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ దాడులకు వ్యూహాలు రచిస్తోందన్న సమాచారంతో సోదాలు చేసిన పోలీసులు..10 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి.

కశ్మీర్ లో ఉగ్రదాడి
10-kg IED recovered in Pulwama

By

Published : May 15, 2021, 10:59 PM IST

జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పుల్వామా జిల్లాలో 10 కిలోల శక్తిమంతమైన ఐఈడీని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఈ దాడికి వ్యూహం రచించినట్లు సమాచారం.

దాడికి సంబంధించిన సమాచారంతో సోదాలు చేపట్టిన పోలీసులు.. పలువురు అనుమానితులను ప్రశ్నించారు.

మరో నలుగురు అరెస్టు..

ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానంతో పుల్వామాలో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. బర్పురా గ్రామంలో రాత్రివేళ జరిపిన దాడుల్లో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:గాజాలోని మీడియా భవనంపై ఇజ్రాయెల్‌ దాడి

ABOUT THE AUTHOR

...view details