కరోనాతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వ ఆర్థిక కీలక నిర్ణయం తీసుకుంది . దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల్లో సంపాదించే వారిని కోల్పోయిన వారికి రూ. లక్ష సాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు.
ఆ కుటుంబాలకు అండగా సీఎం- లక్ష రూపాయలు సాయం - karnataka cm news
కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. దారిద్య్ర రేఖకు దిగువున ఉండే కుటుంబాలకు ఈ మొత్తం అందించనున్నట్లు తెలిపారు.
కర్ణాటక సీఎం యడియూరప్ప
కొవిడ్(Covid)తో చనిపోయిన వారిలో ఎక్కువ మంది కుటుంబ పెద్దలే కావడం వల్ల ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు సీఎం. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:3వేల సిమ్ కార్డులతో భారీ స్కామ్- 9 మంది అరెస్ట్
Last Updated : Jun 15, 2021, 8:31 AM IST