విశాఖ అసైన్డ్ భూములపై వైసీపీ నేతల కన్ను YCP leaders Assigned Lands Danda: అసైన్డ్ భూముల చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకున్న కొందరు వైసీపీ నేతలు.. విశాఖలో పేదల భూములపై కన్నేశారు. ఎక్కడికక్కడ రైతుల మీద ఒత్తిడి తెచ్చి విలువైన భూముల్ని తక్కువ ధరకే కొన్నారు. అడ్వాన్సులు చెల్లించి పత్రాలు రాయించుకున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. అసైన్డ్ భూములపై 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు కల్పిస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అసైన్డ్ భూముల్నిఅమ్ముకునే అవకాశం రైతులకు వచ్చింది. ఇప్పటికే ఒప్పందాల ద్వారా వాలిపోయిన పెద్దలు.. త్వరలో అధికారికంగా తమ పేరిట మార్చుకోవడానికి ప్రభుత్వ నిర్ణయం అవకాశమిస్తోంది.
Dharmanna On Assigned land: అసైన్డ్ భూములపై వైసీపీలా మరెవరూ శ్రద్ధ పెట్టలేదు: మంత్రి ధర్మాన
Assigned Lands: అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకునేందుకు అమరావతి ప్రాంతానికి చెందిన ఒక మంత్రి వ్యూహాల మేరకు.. వారి కుటుంబీకులు విశాఖలో చక్రం తిప్పినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లాలోని 4 మండలాల పరిధిలో ముమ్మరంగా తిరిగారు. వీరికి ఇద్దరు విశ్రాంత రెవెన్యూ అధికారులు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 300 ఎకరాలకుపైగా భూముల్ని ఒప్పంద పత్రాల ద్వారా కొన్నట్లు చెబుతున్నారు. మధురవాడ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందని అంటున్నారు.
Assigned Lands in visakha: ఆనందపురం మండలం గుడిలోవలో మూడెకరాల భూమి కొనుగోలు విషయంలో.. రైతులపై మంత్రి కుటుంబసభ్యులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఎకరాకు రూ.35 లక్షలు చెల్లిస్తామని, 9 నెలల్లోపు అభివృద్ధి ఒప్పందం చేసుకుంటామని.. అలా జరగకుంటే ముందస్తు చెల్లింపును వదులుకొని భూమిని తిరిగిచ్చేస్తామని బేరసారాలు సాగించారు. తమకు రాజధాని స్థాయిలో ఉన్న పలుకుబడిని వివరించడంతో.. రైతులు భయపడి ఒప్పందం చేసుకోక తప్పలేదు. ఇదంతా మంత్రి కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని అంటున్నారు. ఆ మంత్రి కూడా ఇటీవల పలుమార్లు తనిఖీల పేరుతో విశాఖ వచ్చి వెళ్లారు. ఆయనకు విశాఖతో ఎక్కువ అనుబంధం ఉంది. భూముల కొనుగోలుకు గత పరిచయాలను వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.
Medak collector: 'అసైన్డ్ భూములను.. ఈటల కుటుంబం కబ్జా చేసింది నిజమే'
Assigned lands danda in Visakha: విశాఖ జిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలాల్లో అధికార పార్టీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.30 లక్షల వరకు, మరికొందరు ఇంకా తక్కువకు కొన్నారు. ఓ నేత అండతో ఆనందపురం మండల పరిధిలో ఒకేచోట 30 ఎకరాల వరకు ఒక వ్యక్తి కొన్నట్లు సమాచారం. వీరందరికీ ప్రభుత్వ నిర్ణయం గురించి ముందే తెలియడంతో.. పేదల భూములనుతమ పరం చేసుకున్నారు. విశాఖలో 11 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాలకుపైగా పేదలకు అసైన్ చేశారు. వీటిలో జగనన్న కాలనీల కోసం ఇటీవల 6 వేల ఎకరాలు సమీకరించారు. వీ.ఎమ్.ఆర్.డీ.ఏ, ఇతర అవసరాలకు 770 ఎకరాలు సమీకరిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద 3 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. 6 నెలలుగా స్థిరాస్తి వ్యాపారులు, అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నవారు.. వెయ్యి ఎకరాలకు అడ్వాన్సులు చెల్లించి కొనుగోలు ఒప్పందాలు రాయించుకున్నట్లు తెలిసింది.
YSRCP Leaders canal kabza: తారా స్థాయికి వైఎస్సార్సీపీ ఆగడాలు.. ఏకంగా కాలువనే..!