విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు త్యాగం చేసిన వారికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే.. ఊరుకోబోమని తెదేపా మాజీఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేంద్రప్రభుత్వం కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి స్టీల్ ప్లాంట్‌కు చెందిన దాదాపు వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేశారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలంటూ... ధర్నాలు చేశారు. ఈనెల 8న గాజువాక బంద్‌కు కార్మికులు పిలుపునిచ్చారు. వారి బంద్‌కు తెదేపా మద్దతు తెలుపున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రప్రభుత్వం మానుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
'విశాఖ ఉక్కు నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోబోం' - వైజాగ్ స్టీల్ ప్లాంట్
విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు త్యాగం చేసిన వారికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోబోమని తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు.
మీడియాతో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు