మందడం మహాధర్నాలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. నిరసనకారులను అరెస్టు చేస్తుండగా... పోలీసులు గొంతు నులమటంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కళ్ళజోడు పగిలి కంటి వద్ద, ఇతర చోట్లా గాయాలయ్యాయి. పోలీసులు 108 వాహనంలో మహిళను ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. గ్రామస్థులు పోలీసుల సాయం నిరాకరించి వారి వ్యక్తిగత వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల అరెస్టు ప్రక్రియలో తమ గొలుసులు పోయాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళసూత్రాలు బలవంతంగా లాగేసారని ఆరోపించారు.
దీనిపై ఏఎస్పీ చక్రవర్తి స్పందిస్తూ.. తాము మహిళలపై దాడి చేయలేదన్నారు. రోడ్డుపై బైఠాయించిన వారిని తప్పించేందుకే ప్రయత్నించామని.. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనలో కొందరు గాయపడి ఉంటారని చెప్పారు. సకలజనుల సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొంటే... తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..