ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2019, 6:14 PM IST

ETV Bharat / state

'వేధింపులు మానుకోకుంటే తిరిగి కేసులు పెడతాం'

శ్రీకాకుళం జిల్లాలో వైకాపా బాధితులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలిశారు. తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, పోలీసులూ అక్రమ కేసులు పెడుతున్నారని బాధితులు వాపోయారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బాబు... ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చే ప్రయత్నాల్లో వైకాపా ఉందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్​ చేయడమే వైకాపా లక్ష్యం : చంద్రబాబు

రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్​ చేయడమే వైకాపా లక్ష్యం : చంద్రబాబు

రెండోరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... వైకాపా బాధితులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న తమపై అక్రమ కేసులు బనాయించి... వేధిస్తున్నారని అధినేత వద్ద వాపోయారు. అధికారపార్టీ నాయకుల మాటే వింటున్న పోలీసులు... తమ గోడు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల పక్షాన ఉండాలనిఅధికారులకు, పోలీసులకు సూచించారు. రాష్ట్రాన్నినేరాంధ్రప్రదేశ్​లా మార్చేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని బాబు ఆరోపించారు. రేపు అనేది ఉందని మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రభుత్వ దుశ్చర్యలపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు... తిరిగి కేసులు పెడతామని హెచ్చరించారు. గత 4 నెలల్లో జిల్లాలో జరిగిన ఘటనలపై శ్రీకాకుళం ఎస్పీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details