కూన రవికుమార్‌కు చంద్రబాబు పరామర్శ - శ్రీకాకుళంలో చంద్రబాబు తాజా వార్తలు
శ్రీకాకుళంలో రెండో రోజు పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వ అధికారులను దూషించారని ఇటీవలే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రాకపోయేసరికి... కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపారు. బెయిల్ వచ్చాక ఇటీవలే ఇంటికి వచ్చారు. ఆయన్ని చంద్రబాబు పరామర్శించారు.