ఇదీ చదవండి:
హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు - హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు
కర్నూలు జిల్లా నంద్యాలలో రాష్ట్ర స్థాయి మహిళా హాకీ పోటీలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన జూనియర్, షబ్ జూనియర్ మహిళా క్రీడాకారులు తలపడ్డారు. సబ్ జూనియర్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు గెలుపొందింది. ఈ విభాగంలో రన్నర్‌గా చిత్తూరుజిల్లా జట్టు నిలిచింది. జూనియర్ విభాగంలో విశాఖ జిల్లా విజయం సాధించింది. రన్నర్‌గా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. గెలుపొందిన విజేతలకు నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి బహుమతులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో దేశానికీ పేరు ప్రతిష్టలు తీసుకురావలని ఆయన తెలిపారు.
హోరాహోరీగా ముగిసిన మహిళా హాకీ పోటీలు
TAGGED:
hockey