ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గొర్రెల కాపరిగా కేఏ పాల్​.. ప్రచారం మామూలుగా లేదుగా..

By

Published : Oct 30, 2022, 8:28 PM IST

KA PAUL : మునుగోడు ఉపఎన్నికకు ప్రచార గడువు దగ్గర పడటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ప్రజలను ఆకర్షించేందుకు ఎవరి తరహాలో వారు ప్రచారం చేస్తూ హామీలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ నాంపల్లి మండలంలో గొర్రెల కాపరిలా దర్శనమిచ్చారు.

KA PAUL AT MUNUGODE
KA PAUL AT MUNUGODE

KA PAUL AT MUNUGODE : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార గడువు దగ్గర పడడంతో నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారాలు నిర్వహిస్తూ ఆదరణ పొందుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్ధులు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నాంపల్లి మండలంలో గొర్రెలు కాస్తూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తనకు ఓటేసి గెలిపిస్తే.. గ్రామానికి 20 మందికి ఉద్యోగాలు ఇస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

గొర్రెల కాపరి గెటప్​లో కేఏ పాల్​ ప్రచారం.. మామూలుగా లేదుగా..

ABOUT THE AUTHOR

...view details