గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం విడుదల చేసిన బులిటెన్లో తాజాగా 635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాల్లో వీటి సంఖ్య 36,289కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 26,740 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో శనివారం కొత్తగా 6 మరణాలు సంభవించాయి. వీటితో కలిపి జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ మరణాల సంఖ్య 365కు చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 142 ఉన్నాయి. ఇక మండలాల వారీగా చూస్తే నూజండ్ల-48, మంగళగిరి-47, పెదకూరపాడు-43, బాపట్ల-42, మాచర్ల-40, నరసరావుపేట-36, నాదెండ్ల-23, కర్లపాలెం-22, వినుకొండ-17, అమర్తలూరు-13, ఫిరంగిపురం-11, దాచేపల్లి-10, బొల్లాపల్లి-10 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 85 కేసులు వచ్చాయని తెలిపారు.