ETV Bharat / state

రేపటి నుంచే ఉచితంగా ఇసుక- నదుల్లో తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా - Free Sand Distribution in AP

Free Sand Distribution in AP : మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు చంద్రన్న సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానున్నది. తొలుత నిల్వకేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను అందజేతకు కార్యచరణను సిద్ధం చేసింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 9:54 AM IST

free_sand_ap
free_sand_ap (ETV Bharat)

Free Sand Distribution in AP : రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం (JULY 8) నుంచి అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్‌ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనున్నారు.

గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక బంగారమైపోవడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు జేసీకేసీ (JCKC), ప్రతిమ ఇన్‌ఫ్రా వైదొలగుతున్నట్లు ఆయన తెలిపారు.

అమల్లోకి రానున్న ఉచిత ఇసుక విధానం - మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం - Free Sand Distribution in AP

ఆయా జిల్లాలోని ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు అంచనా వేశారు. ఇదంతా సోమవారం (జులై 8) నుంచి అందజేయనున్నారు. సెప్టెంబరు వరకు మూడు నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్‌ ఉంటుందని అంచనావేశారు.

Free Sand policy to be implemented July 8 : సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, స్థానిక ఇసుక కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(Vigilance And Enforcement Department )ద్వారా నిఘా ఉంచనున్నారు.

ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర - Free Sand Distribution

నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీచేస్తారు. సెక్యూరిటీ స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లులను గనులశాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. సీనరేజ్‌ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటివరకు గుత్తేదారులుగా ఉన్న జేసీకేసీ ప్రతిమ సంస్థలు ఇసుక తవ్వినందుకు అయిన ఖర్చు కింద టన్నుకు 30 రూపాయలు చొప్పున వసూలుచేస్తారు.

ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు 225 రూపాయలు చొప్పున తీసుకుంటారు. రీచ్‌ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణాఖర్చు కింద టన్నుకు, కిలోమీటరుకు 4.90 పైసలు చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చుకింద టన్నుకు 20 రూపాయలు తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయా స్టాక్‌ పాయింట్లలో టన్ను ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారు. ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు.

ఉచిత ఇసుక కేసులో ముగిసిన వాదనలు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు 375 రూపాయలు చొప్పున గుత్తేదారు నుంచి వసూలు చేసేది. సీనరేజ్‌ కింద వసూలు చేసే 88 రూపాయలు జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతినెలా జమచేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయలు చొప్పున తీసుకునే సొమ్మును వేబిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు.

నిల్వకేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. ఆయా జిల్లాలకు కలెక్టర్లుకు, గనులశాఖ అధికారి పేరిట ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా తెరవనున్నారు. ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును ఆ ఖాతాలో జమచేస్తారు.ఇందులో జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలు ఇసుక తవ్వితీసిన ఖర్చు, నిల్వ కేంద్రానికి రవాణా చేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంచనున్నారు. త్వరలో ఆ రెండు సంస్థలకు తొలగింపు నోటీసులు ఇచ్చాక, వాళ్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిల లెక్కలు తేల్చాక ఈ సొమ్మును బాకీ కింద జమచేసుకోనున్నారు. తొలుత వారం, పది రోజులు చేతిరాతతో వేబిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files

వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు.

ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనులశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు. ఇప్పటికే జేసీకేసీ (JCKC), ప్రతిమ ఇన్‌ఫ్రాలకు రాష్ట్రంలో పలు రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతిచ్చింది. వీటిని రద్దుచేయించి, గనులశాఖ తరఫున అనుమతులు తీసుకోనున్నారు. జిల్లాల వారీగా ఏయే రీచ్‌ల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందిస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి వీటికి అనుమతులు తీసుకుంటారు.

ఇసుక టెండర్లలో గోల్​మాల్ - జగన్‌ మార్క్‌ అడ్డాగా దోపిడీ - YSRCP Irregularities Sand Tenders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.