ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుళ్లూరులో మహాధర్నాకు ఉచితంగా కూరగాయల పంపిణీ - రాజధాని మార్పు

తుళ్లూరులో అన్నదాతల మహాధర్నాకు మద్దతుగా నారాకోడూరు, చేబ్రోలుకు చెందిన రైతులు కూరగాయలను అందజేశారు. వంటావార్పు కార్యక్రమం కోసం 50 బస్తాల కూరగాయలను తెచ్చి ఇచ్చారు.

farmers donate vegetables to capital farmers
రైతుల ఆందోళన

By

Published : Jan 4, 2020, 11:59 PM IST

తుళ్లూరులో మహాధర్నాకు ఉచితంగా కూరగాయల పంపిణీ

రాజధాని రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లా నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతానికి చెందిన కూరగాయల రైతులు స్పందించారు. తుళ్లూరులో రాజధాని రైతులు నిర్వహిస్తున్న వంటావార్పు కార్యక్రమం కోసం 50 బస్తాల కూరగాయలను అందజేశారు. తమ భూములు అప్పగించి రోడ్డు మీదకు వచ్చిన రాజధాని రైతులకు అందరూ మద్దతు ప్రకటించాల్సిన అవసరముందని... రోజూ వారికి అవసరమైన కూరగాయలను అందిస్తామని నారాకోడూరుకు చెందిన రైతులు, తెదేపా నాయకులు హామీ ఇచ్చారు. ఇలా రాజధానిని మార్చడం ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డికి భావ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details