ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వి అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం చేస్తున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడి కారులో బంగారు ఆభరణాలు వేసుకొని రైతులు ఎక్కడైన ఉద్యమం చేస్తారా అని పేర్కొన్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని కార్పొరేట్ ఉద్యమంగా వర్ణించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చెన్నకేశవస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. పురాతన దేవాలయాలను వెలుగులోకి తీసుకురావడం కోసం 'మనగుడి' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీనికోసం ప్రకాశం జిల్లాలో దేవాలయాలను సందర్శిస్తున్నట్లు పృథ్వి పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం అనేది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమలలో అన్యమతస్థులు ఉద్యోగాలు నిర్వర్తించకుండా జీవో ఇచ్చిందని గుర్తుచేశారు. 'మా' వివాదంపై ఆయన స్పందించారు. 'మా'లో వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని... అవన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'