శాసనమండలిని వైఎస్సార్ పునరుద్ధరించినప్పుడు జగన్ ఎందుకు నోరు మెదపలేదని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవితో రాజీనామా చేయించి ఆ తర్వాత మండలిపై చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. పదవులు పోతాయని తమకు ఎలాంటి భయం లేదని వ్యాఖ్యానించారు. బెదిరింపులే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చెయ్యరని పేర్కొన్నారు. రాజధాని పేరుతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.
బెదిరింపులే తప్ప మండలిని రద్దు చెయ్యరు: బుద్ధా వెంకన్న - బుద్ధా వెంకన్న తాజా వార్తలు
బెదిరింపులే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చెయ్యరని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పునరుద్ఘాటించారు. వైకాపా నేతలు విశాఖలో భూముల ఆక్రమణ కోసమే 3 రాజధానుల నిర్ణయం తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న